నా మెడ వొంపున వెచ్చగా తాకే నీ ఊపిరి
నా నడుము వొంపులో నాట్యం చేసే నీ చేతివేళ్లు
నన్ను నీలో పొదువుకుంటూ అధికారంగా నీ చేతులు
నా అణువణువు నీలో కలిసిన వేళ
అరమోడ్పులైన నా కన్నుల జారి
ఎర్రబడ్డ నా చెక్కిలిని ముద్దాడి
అదిమిపెట్టిన నా పెదవి అంచున
గర్వంగా కరిగిందొక కన్నీటి చుక్క !!


మరు జన్మలో నీ గుండె నై పుడతా!
నీతో పుట్టి నీ తోనే వెళ్ళిపోతా !!
నీ ఉనికి నవుతా, నీ మనసు నాలో దాచుకుంటా!
నీకు జీవాన్నై, ధైర్యాన్నై;
ప్రతి క్షణం నా ప్రేమని నీ గుండె చప్పుళ్ళలో చెపుతుంటా!

అప్పటి వరకు, నీలో ఐక్యమైపోయే ఆ క్షణం వరకు,
నిన్ను చూస్తూ, నిన్ను ప్రేమిస్తూ,
ఆరాధించే నీ పిచ్చి పెళ్ళాం.


నువ్వు లేనప్పుడు నేను నేనుగా ఉన్నాను..
నువ్వు కలిసాక నేను నీవుగా ఉన్నాను..
నువ్వు వెళ్ళాక ఏమైంది..,
నా ఉనికినే కోల్పోయాను....


మనసులో కోటివీణలు ఘోషిస్తున్నా
మనసు మాట్లాడనీయదు
కనులు జలపాతాలవుతున్నా
కల నుంచి ఇల చేరాలనిపించదు
గుండెలో చితి మంటలు చెలరేగినా
బిడియం నిను చేరనీయదు


నా జీవితం లో క్షణ క్షణాన్ని పేర్చాలనుంది,
నీతో గడపడానికి !
నా మనసులో భావాలన్నీ కన్నుల్లో చేర్చాలనుంది,
నీతో పంచుకోవడానికి !
ఏమో ఎవరికి తెలుసు? నిన్ను చూసిన క్షణం
గుండె గొంతుకలో అడ్డుపడి, వేవేల ఊసులు
కన్నీళ్ళై కట్టలు తెన్చుకున్టాయేమో??

Faith

When God leads you to the edge of the cliff, trust him fully and let go !
Only 1 of 2 things will happen, either He will catch you when you fall,
or He will teach you how to fly !


सब कहते हैं की हम सो रहे हैं !
उन्हें क्या पता, बंद पलकों के नीचे
जो आपका चेहरा सजाए रखा था,
कही आँख खुलने से उतरना जाए !!


एक जमाना था , मेरी पहचान तेरे नाम से शुरू होता था !
मेरा चेहरा तेरी आंखों में चिपा रहता था !
मेरी धड़कन तेरी आहट में जिया करता था !
मेरी चाहत तेरी जुनून से लिपटा होता था !
ओ मेरे यार,
लौटादे वो तेरी नज़र , वो तेरी ग़ज़ल,
जिसमे,
तेरी मेरी कहानी लिखा होता था !!


నిన్ను చూస్తున్న నా కంటికి
కనురెప్పలే శత్రువులు !
క్షణ కాలం నీకు నాకు అడ్డైనందుకు !!

నువ్వు నడిచే దారిలో నీ కాలి కింద
ఒక గడ్డి పువ్వు కనిపిస్తే దాటిపోకు నేస్తం !
అది నేను పారేసుకున్న నవ్వు కావొచ్చు !!
నువ్వు అలిసినప్పుడు ఒక చల్లగాలి
నిన్ను తాకిపోతే గుండెనిండా పీల్చుకో ప్రియతమా !
అది నీకై నేను వదిలిన నా నిట్టూర్పు కావొచ్చు !!
సముద్రం ఒడ్డున నీ పాదాన్ని తాకుతూ
ఒక అల సాగిపోతే జారిపోకు హృదయమా !
అది నీకై కారిన నా కన్నీటి చుక్క కావొచ్చు !!
ఏ క్షణమైనా నీ మనసులో అలజడి రేగితే
కంగారు పడకు ప్రాణమా !
అది నా గుండె చప్పుళ్ళలో నేను పలికే
నీ ఊసులని ఒక్క క్షణం గుర్తు తెచ్చుకో !!

నీ ఊహల్లో ఏ మైకంలో తూగానో..
నా జీవితాన్ని పారేస్కున్నాను
సముద్రపు ఒడ్డున గవ్వలేరుకునే ప్రయత్నం లో
నా జీవితమనే అమూల్యమైన ముత్యాన్ని కోల్పోయాను..
మళ్లీ ఏ సాగర మధనం చేయాలో..,,
ఏ దిగంతాల్ని జయించాలో..,
దారి తప్పిన బాటసారిని నేను..
కళ్లు తెరిచే సరికి తీరం దాటిపోయాను ...


నా ఎదురుచూపులోని ప్రతి క్షణాన్ని
నువ్వొచ్చే దారిలో పరిచాను !
ఏ మలుపులోనో నీ అడుగు
పడకపోతదా అని !
ఎదురుచూపులో క్షణమొక యుగమైతే
ఎన్ని జన్మలెత్తాలి నేస్తం నిన్ను చేరడానికి?


ఎందుకు నిన్ను చూసిన నా కంటికి అంత అందం ?
నిన్ను చూసిన క్షణం నా కళ్ళల్లో ఆ మెరుపు ఎందుకు?
మనసంత ఎగిసిపడుతుంది ఎందుకు?
ఇన్నేళ్ళయినా నా మనసంతా నువ్వే అల్లుకుపోతావెందుకు?
నిన్ను తలచిన క్షణం ప్రపంచం మొత్తం నువ్వే కనిపిస్తావెందుకు?
నువ్వు ఎదుట లేవని తెలిసినా నా కల్లెందుకు నీ కోసం ఇంత వెతుకుతున్నాయి?
నీ పేరు రాసుకుని ప్రతి అక్షరం తడిమి చూస్తానేందుకు?
నీ పేరు ఎక్కడ వినిపించినా నా గుండె చప్పుడు ఒక్క క్షణం ఆగిపోతుందేందుకు?
నీ తలపులతో నేనింత కొట్టుకుంటుంటే ఇకనైనా నా వద్దకు రావెందుకు?